జీవిత విశేషాలు
ఆయన కృష్ణా జిల్లా నడకుదురు(చల్లపల్లి) గ్రామంలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మీనారాయణ శాస్త్రి. ఆయన పూర్వీకులు బెనారస్ నుండి వచ్చిన వైదిక గురువులుగా సుప్రసిద్ధులు. ఆ వంశవృక్షంలో ఆయనకు పూర్వం 33 తరాలవరకు వైదిక ధర్మపరులైన పూర్వీకులుండేవారు. అనేక మంది పీఠాధిపతులు మరియు ఆధ్యాత్మిక గురువులు మరియు మైసూరు రాయల్టీ, శృంగేరీ పీఠం ఆస్థాన విద్వాంసులు సైతం విశ్వంగారి తండ్రిగారైన లక్ష్మీనారాయణ శాస్త్రిని కలసేవారు. ఆయనకు సాధారణంగా అలిపిరాల విశ్వం జన్మించినప్పటికీ ఆయన పూర్వజన్మకు సంబంధించిన ఆధ్యాత్మిక సంపద, పరమగురు మహావతార్ బాబాజీ ఆయనను ఒక యోగిగా గుర్తించినట్లు అవగతమైనది.
ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన తర్వాత పద్యం, ధారణ, కళలు మరియు వాక్పటిమల పట్ల విశేష ప్రతిభ కనబరిచాడు. ఆయన న్యూయార్క్ నందలి ప్రపంచ పొయిట్రిక్ సొసైటీ నుండి అవార్డును అందుకున్నారు. ఆయన చిన్నవయసులోనే యునైటెడ్ నేషన్స్ మైస్టిక్ గ్రూపులో ప్రసంగించి తన ప్రతిభను ప్రపంచానికి చాటాడు. ఆయన భూగ్రహంపై గల 2000 మంది ప్రతిభావంతులైన పౌరులలో ఒకనిగా గుర్తింపబడ్డాడు. ఆయన తన స్వంత రాష్ట్రంలో డాక్టరేట్ పొందడమే కాకుండా ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలనుండి తొమ్మిది డాక్టరేట్లతో సత్కరింపబడ్డాడు. ఆయన సాహిత్య అకాడమీ అవార్డును కూడా పొందారు. తన స్వంత రాష్ట్రమే కాకుండా 137 దేశాలలో సుపరిచిత వ్యక్తిగా నిలిచాడు. ఆయన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో[1] పాల్గొనడమే కాకుండా వివిధ సంస్థలలో సభ్యునిగా, డైరక్టరుగా, చైర్మన్ గా అనేక సేవలనందించారు.విశ్వం గారు చేసిన ప్రసంగాలను 10000 ఆడియో సిడి ల యందు రికార్డ్ చెసారు. ఆయన రెండవ కుమారుడు అరిపిరాల రామకృష్ణ గారు వారి తండ్రిగారు చేసిన ప్రసంగాలను పుస్తకాలు రూపములో ప్రజలకు అందుబాటు లోకి తెస్తున్నారు. అరిపిరాల విశ్వం గారు కొంతకాలం తర్వాత ప్రజా జీవితం నుండి అదృశ్యమై (2010) లో తన గురువు అయిన మహావతార్ బాబాజీ గారి ఆజ్ఞ మేరకు ప్రజాజీవితంతో స్వీయ బహిష్కరణ విధించుకున్నారు. ఆయనకు వారి గురువుగారైన మహావతార్ బాబాజీ ఆనందఘన అన్న నామాన్ని విశ్వం గారికి ఇచ్చారు. ఆయన రాసిన బుక్స్ అన్నీ కూడా ఆనందఘన Dr అరిపిరాల విశ్వం అన్న పేరు మీద ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు (దాదాపు 400 ) లలిత పరమేశ్వరి మరియు గురువు గారైన మహావతార్ బాబాజీ కృపతో రాశారు. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు ఇంత లోతైన జ్ఞానం తో రాయడం మామూలు మానవుడివల్ల వీలుకాదనియు ఇతను కారణజన్ముడని మనకు అర్ధమౌతున్ది. ఈయన గడిపిన జీవితం కూడా ఎంతో సామాన్యం గ గడిపారు. క్రియ యోగం లో ఆనందఘన (విశ్వం) గారు గొప్ప నిష్ణాతుడు. అయన దగ్గర ఎంతో మంది శిష్యులు క్రియ యోగ నేర్చుకున్నారు.ఈయన రాసిన బుక్స్ లోసాధన పంచతంత్రం మరియు ఖడ్గమాలా దర్శనము (ఇంత వివరణ ఎవరూ రాసిన దాఖలా లేదు) చదివితే లలిత అమ్మవారి అనుగ్రహం ఈయన మీద ఎంత వున్నదో మనకు అవగతమౌతున్ది. ఆయన "పరంపర విశ్వంభర" అనే సంస్థను స్థాపించి అనేక ఆధ్యాత్మిక విషయాలను ప్రబోధించడమే కాకుండా వివిధ యోగాలను సాధకులకు నేర్పించేవారు.ఆయన తోటి జీవుల యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతికి అంకితం ఒక ట్రస్ట్ ప్రారంభించారు.
No comments:
Post a Comment